: పార్కింగ్ స్థలాలు లేని రెస్టారెంట్స్, హోటల్స్ అన్నీ మూసివేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు
తమిళనాడులో వాహనాల పార్కింగ్ సమస్య ఎక్కువవడంతో, కస్టమర్లకు ఆ సదుపాయం కల్పించని హోటళ్లు, రెస్టారెంట్లను మూసేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉండి, వాహనాలను రోడ్లపైనే నిలుపుతుండడంతో ట్రాఫిక్ జాంకు దారి తీస్తోంది. దీంతో వాహనదారులు తీవ్రంగా సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఈ సమస్యపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు పై విధంగా ఆదేశాలు జారీ చేస్తూ ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. ఆ తేదీకి మూడు రోజుల ముందుగా తమకు జాయింట్ ప్రొగ్రెస్ రిపోర్టును అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.