: మన దేశంలో కన్నా అమెరికాలోనే మహిళలపై ఎక్కువ వివక్ష: సుజనా చౌదరి
మన దేశంలో కన్నా అమెరికాలో మహిళలే ఎక్కువ వివక్షకు గురవుతున్నారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న మహిళలు, తమ సాధికారత కోసం పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.