: ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్టుకు చేరుకున్న శశికళ.. అక్కడే పోలీసులు.. మరోసారి ఉత్కంఠ
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో 92 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్.. గోల్డెన్ బే రిసార్టులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే, వారిలో తిరుగుబాటు చెలరేగుతుండడంతో శశికళ.. పోయెస్ గార్డెన్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్‌లో గల ఆ రిసార్టుకు చేసుకున్నారు. మరోవైపు అదే రిసార్టులో ఎమ్మెల్యేలను పోలీసు అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శశికళ వెంట ముగ్గురు మంత్రులు కూడా అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది.