: అందుకే, రఘురాం రాజన్ తప్పుకోవాల్సి వచ్చింది: చిదంబరం
పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించిన కారణంగానే ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి రఘురాం రాజన్ తప్పుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఫియర్ లెస్ ఇన్ అపోజిషన్, పవర్ అండ్ అకౌంట్ బిలిటీ’ పేరిట చిదంబరం రాసిన పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి రఘురాం రాజన్ దిగిపోయిన రోజున కేంద్రానికి ఒక లేఖ అందిందని, పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ రఘురాం రాజన్ ఐదు పేజీల లేఖను రాశారని చిదంబరం అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే ఈ లేఖను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రఘురాం రాజన్ తన పదవి నుంచి తప్పుకోవడానికి గల కారణాల్లో నోట్ట రద్దు కూడా ఒకటని, ఆ పదవిలో ఆయన కొనసాగకుండా కొందరు అడ్డుకున్నారని చిదంబరం ఆరోపించారు.