: దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు చర్యలు
దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్న చైనా మరో దుస్సాహసం చేసింది. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ వాయుమార్గంలో ఆ దేశానికి చెందిన విమానం కలకలం రేపింది. అక్కడ తిరుగుతున్న అమెరికాకు చెందిన యాంటీ సబ్‌మెరైన్ విమానం సమీపం నుంచి చైనాకు చెందిన సైనిక విమానం చక్కర్లు కొట్టి అలజడి సృష్టించింది.
ఆ రెండు విమానాల మధ్య దూరం కేవలం 1000 అడుగులే కనిపించిందని పెంటగాన్‌కు చెందిన నేవీ కెప్టెన్ జెప్‌డేవిస్ పేర్కొన్నారు. తమ నావికాదళ విమానం తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించేందుకే చైనా ఈ దుస్సాహసానికి దిగినట్లు ఆయన చెప్పారు. అయితే, ఆ సముద్రంలో చైనా సైనికాధిపత్యాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మరుసటిరోజే చైనా ఈ ప్రమాదకర చర్యకు పాల్పడడం విశేషం.