: నేను వ్యక్తిగతంగా శశికళకే మద్దతు ఇస్తా: విజయశాంతి
తమిళనాడులో రాజకీయ సంక్షోంభం నెలకొనడంపై ప్రముఖ సినీ నటి విజయశాంతి స్పందించారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, తాను వ్యక్తిగతంగా శశికళకే మద్దతు ఇస్తానని అన్నారు. తమిళనాడులోని తాజా రాజకీయ పరిణామాలు తనను బాధిస్తున్నాయని, అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభానికి తెర పడాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, జయలలిత మృతి చెందిన తర్వాత శశికళను పరామర్శించేందుకు పొయెస్ గార్డెన్ కు విజయశాంతి ఆమధ్య వెళ్లారు. అన్నా డీఎంకే పార్టీని ముందుండి నడిపించాలని శశికళను ఆమె కోరడం విదితమే.