: రెమ్యూనరేషన్ లో తేడాలపై ప్రశ్నించి నానా మాటలు పడ్డాను: మనీషా కొయిరాలా
బాలీవుడ్ లో నటీ నటులకు రెమ్యూనరేషన్ లో తేడాలపై ఒక నిర్మాతను అప్పట్లో ప్రశ్నించి తాను నానామాటలు పడాల్సి వచ్చిందని ప్రముఖ నటి మనీషా కొయిరాలా చెప్పింది. అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు హాజరైన మనీషా, ‘వివక్ష-అసమానతలు’ అనే అంశంపై ప్రసంగించిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
నటించేందుకు తమకు, హీరోలకు ఇచ్చే పారితోషికంలో చాలా అంతరం ఉంటుందని మొదట తనకు తెలియదని, తెలిశాక దిగ్భ్రాంతికి గురయ్యానని, ఈ తేడా గురించి ఒక నిర్మాతను ప్రశ్నించగా ఆయనతో మాటలు పడాల్సి వచ్చిందని అన్నారు. ఈ తరహా వివక్ష కేవలం బాలీవుడ్ కే పరిమితం కాదని, బయట మహిళలలు కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారని పేర్కొంది.