: సీఎం సీటు కోసం ఆయన వెయ్యి కోట్లు ఇచ్చారు: యెడ్యూరప్ప తీవ్ర ఆరోపణలు


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పెద్దలకు సిద్ధరామయ్య వెయ్యి కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఆయనకు ప్రధాన అనుచరుడైన ఎమ్మెల్సీ గోవిందరాజు ద్వారా ఈ సొమ్మును కాంగ్రెస్ పెద్దలకు ముట్టజెప్పారని అన్నారు. ఇప్పటికీ సీఎం పదవిని కాపాడుకోవడానికి ఆయన చేయని పని లేదని విమర్శించారు. సిద్ధరామయ్య వ్యవహారాలకు సంబంధించి అన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు. అయితే, సిద్ధరామయ్య ముడుపులు ఎవరెవరికి వెళ్లాయో చెప్పడానికి మాత్రం యెడ్డీ నిరాకరించారు.

  • Loading...

More Telugu News