: ఆ తేడాను పవన్ స్పీచ్ చెబుతుంది: సినీ నటుడు సంపూ


అమెరికాలోని న్యూహాంప్ షైర్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన ప్రసంగంపై ప్రముఖ హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు స్పందించాడు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశాడు. ‘కడుపు నిండిన నాయకుడికి, కడుపు మండిన నాయకుడికి తేడా పవన్ కల్యాణ్ స్పీచ్’ అని పేర్కొన్నాడు. ఏపీలో మూడు రోజులుగా జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షకు, అన్ని వైపుల నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసిన సంపూ, ‘ఆంధ్రుల హక్కుల ఆత్మ గౌరవ దీక్ష’ పేరిట దీక్ష చేస్తున్న వారి ఫొటోను మరో ట్వీట్ లో పోస్ట్ చేశాడు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై మొదటి నుంచి సంపూర్ణేష్ బాబు తన మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ‘కొబ్బరిమట్ట’ చిత్రం కోసం కొత్త గెటప్ లో ఉన్న తన ఫొటోను సంపూ ఇటీవల పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకు ఆయన అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.

  • Loading...

More Telugu News