: శశికళ వర్గానికి గుడ్ బై చెబుతూ.. పన్నీర్ సెల్వం నివాసం వద్దకు చేరుకున్న మంత్రి పాండ్యరాజన్


తమ రాష్ట్రానికి శశికళ నటరాజన్ ముఖ్యమంత్రి కాకూడదంటూ తమిళనాడులోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని ఈ రోజు ఉద‌యం ట్వీటుతో శిశిక‌ళకు షాక్ ఇచ్చిన మంత్రి పాండ్యరాజన్ అంద‌రూ ఊహించిన‌ట్లుగానే ప‌న్నీర్ సెల్వం వ‌ద్ద‌కు చేరారు. కొద్దిసేప‌టి క్రితం పన్నీర్ సెల్వం నివాసం వ‌ద్దకు వ‌చ్చిన ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం పన్నీర్ సెల్వం మీడియా ముందు ఆయ‌న‌కు శాలువా క‌ప్పి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్యాండ్యరాజ‌న్ మాట్లాడుతూ... తాను ప‌న్నీర్ సెల్వంకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పార్టీని ఐక్యంగా ఉంచాల‌నే ఉద్దేశంతోనే తాను ప‌న్నీర్ వ‌ర్గంలో చేరాన‌ని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే తాను పన్నీర్ తో కలిశానని అన్నారు.

  • Loading...

More Telugu News