: సర్వే రిపోర్ట్... పన్నీర్ కు 97 శాతం, శశికళకు 3 శాతం


తమిళనాట పన్నీర్ సెల్వంకు మద్దతు అమాంతం పెరుగుతోంది. ముఖ్యమంత్రి పదవిలో పన్నీర్ సెల్వం కొనసాగాలని ఆ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. శశికళ నియంతృత్వ ధోరణిని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శశికళ సీఎం అయితే మన్నార్ గుడి మాఫియా అరాచకాలను భరించలేమని తమిళ ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ తమిళ దినపత్రిక సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ఫలితాల్లో పన్నీర్ సెల్వం సీఎంగా ఉండాలని 97 శాతం మంది ప్రజలు కోరుకున్నారు. శశికళకు కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.  

  • Loading...

More Telugu News