: పన్నీర్ సెల్వంపై మండిపడ్డ శశికళ
తన శిబిరం నుంచి ఒక్కొక్కరు జారుకుంటుండటంతో శశికళ సంయమనం కోల్పోతున్నారు. ఒక్కో రోజు గడిచే కొద్దీ, తన బలగం సన్నగిల్లుతోందన్న ఆందోళనలో ఉన్న శశికళ... గవర్నర్ కు మరో లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. మరోవైపు, తమ శిబిరం నుంచి వెళ్లిపోయిన రాష్ట్ర మంత్రి పాండ్య రాజన్... పన్నీర్ కు మద్దతు ప్రకటించడంతో ఆమెలో ఆందోళన ఎక్కువైంది. ఈ నేపథ్యంలో, జయలలిత ఆశయాలకు విరుద్ధంగా పార్టీని చీల్చేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పన్నీర్ సెల్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా... పార్టీని చీల్చలేరని చెప్పారు. పార్టీలోని ఎమ్మెల్యేలంతా తన వెనుకే ఉన్నారని తెలిపారు.