: అమ్మ ఆత్మ మమ్మల్ని నడిపిస్తోంది.. గెలుస్తాం: పన్నీర్ సెల్వం
తమిళనాడు అధికార అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్, ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మధ్య పోరు కొనసాగుతోంది. సీఎం కుర్చీ కోసం శశికళ నటరాజన్ వేస్తున్న ఎత్తులకు పన్నీర్ సెల్వం వర్గీయులు పై ఎత్తులు వేస్తున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావుకి శశికళ ఈ రోజు లేఖ రాసిన వేళ.. పన్నీర్ సెల్వం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. అమ్మ జయలలిత ఆత్మ తమను నడిపిస్తోందని అన్నారు. సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుందని, అది తమవైపే ఉందని వ్యాఖ్యానించారు. తమిళప్రజల ప్రయోజనాలను కాపాడాలనుకునే అన్నాడీఎంకే నేతలందరూ తమవైపుకి వస్తారని తనకు నమ్మకం ఉందని ఆయన అన్నారు.