: పోలీస్ జీప్ నుంచి దూకి... 'కాపాడండి' అంటూ పరుగులు తీసిన రోజా
అమరావతిలో జరుగుతున్న పార్లమెంటేరియన్ల సదస్సుకు వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే అడ్డుకున్న పోలీసులు... ఆమెను గుంటూరు జిల్లా వైపు తరలించారు. ఈ క్రమంలో పోలీస్ జీపు పేరేచర్ల చేరుకుంది. పేరేచర్ల సెంటర్ లో ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద పోలీస్ జీపు నుంచి రోజా దూకేశారు. అంతేకాదు, కాపాడండి అంటూ కేకలు వేసుకుంటూ రోడ్డుపై పరుగులు తీశారు. ఆమెను వెంబడించి పట్టుకున్న పోలీసులు మళ్లీ పోలీస్ వాహనం ఎక్కించారు. ఆ తర్వాత పోలీస్ జీపు సత్తెనపల్లి వైపుగా బయల్దేరింది.