: సోషల్ మీడియాలోనూ పోస్టులు చేశారు.. అందుకే రోజాను అదుపులోకి తీసుకున్నాం: డీజీపీ
అమరావతిలో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ ఘటనపై డీజీపీ సాంబశివరావుకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... తాము ఎవ్వరికీ వ్యతిరేకం కాదని అన్నారు. పార్లమెంటేరియన్ల సదస్సుకు ఎంతో మంది ప్రతినిధులు వచ్చారని, అయితే, రోజా సదస్సుకు వచ్చి విఘాతం కలిగిస్తారని తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో పలు పోస్టులను తాము గమనించామని, రోజా అక్కడకు వచ్చి గందరగోళం చేస్తారనే అనుమానంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఏ గొడవా చేయబోమని హామీ ఇస్తే తాము అనుమతి ఇస్తామని వైసీపీ నేతలతో అన్నారు.