: ఇక ఆలస్యం చేయద్దు.. బలనిరూపణకు అవకాశం ఇవ్వండి: గవర్నర్‌కు శశికళ లేఖ
తమిళనాడు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా గవర్నర్ విద్యాసాగర్ రావు త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ అన్నారు. ఈ రోజు ఆమె గవర్నర్‌కు ఓ లేఖ రాస్తూ... అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారు. పన్నీర్ సెల్వం రాజీనామా చేసి వారం రోజులు గడిచాయని, రాజీనామాను గవర్నర్ కూడా ఆమోదించారని ఆమె గుర్తు చేశారు. తనకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని తాను రెండు రోజుల క్రితమే గవర్నర్‌కు చెప్పానని అన్నారు. గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్యం, ప్రజాప్రయోజనాలను కాపాడతారని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.