: రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా సమాధానం చెప్పాలని కోరుతున్న పోలీసులు
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో శశికళ నటరాజన్ సుమారు 120 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్సుల్లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మహాబలిపురం సమీపంలోని కోవత్తూర్‌లో గల రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. రిసార్టుకు వాళ్లంతట వాళ్లే వచ్చారా? లేక ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చి నిర్బంధించారా? అని వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా చెప్పాలని కూడా పోలీసులు కోరుతున్నారు. వారిని గనుక నిర్బంధిస్తే అది చాలా పెద్ద నేరం అవుతుందని మద్రాస్ హైకోర్టు ఇటీవలే మండిపడింది.