: రోజా సదస్సును అడ్డుకుంటామన్నారు.. అందుకే పోలీసులే రోజాను అడ్డుకున్నారు: టీడీపీ ఎమ్మెల్యే అనిత
మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్యే అనిత సమాధానం ఇచ్చారు. మంచి కార్యక్రమాలను చెడగొడతామంటే ఊరుకునేది లేదని ఆమె అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న సదస్సును అడ్డుకుంటామని రోజా అన్నారని, అందుకే పోలీసులు రోజాను అడ్డుకున్నారని అనిత చెప్పారు. నిన్న వైసీపీ నుంచి బుట్టా రేణుక కూడా వచ్చారని, ఆమె ఎంతో చక్కగా, పద్ధతిగా నడుచుకుని మాట్లాడారని ఆమె తెలిపారు. వైసీపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.