: మొన్న శశికళతో పాటే గవర్నర్ వద్దకు వెళ్లాడు... ఇప్పుడు ఆమెకే షాక్ ఇచ్చాడు


తమిళనాడు ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాలనుకుంటున్న శశికళకు మరో షాక్ తగిలింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాండ్య రాజన్... శశికళ వర్గం నుంచి బయటకు వచ్చారు. శశికళ ముఖ్యమంత్రి కాకూడదంటూ తమిళనాడులోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని... తాను ప్రజాభిప్రాయం మేరకే నడుచుకుంటానని ఆయన ట్వీట్ చేశారు. మొన్న గవర్నర్ విద్యాసాగర్ రావును శశికళ కలిసినప్పుడు ఆమె వెంట పాండ్య రాజన్ కూడా ఉన్నారు. శశికళకు గుడ్ బై చెప్పిన రాజన్... పన్నీర్ సెల్వం వర్గంలోకి వెళతారని విశ్వసనీయ సమాచారం. తాను ఎంతగానో నమ్మిన రాజన్ తనను వీడటంతో శశికళ షాక్ కు గురయ్యారు. 

  • Loading...

More Telugu News