: నా పేరులోనూ మొదట మ‌హిళ పేరే ఉంది: గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్


త‌న‌ పేరులోనూ మొదట మ‌హిళ పేరే ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అన్నారు. త‌న పూర్తి పేరు ల‌క్ష్మీ న‌ర‌సింహ‌న్ అని చెప్పారు. అమ‌రావ‌తితో జ‌రుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొన్న న‌ర‌సింహ‌న్ ఈ రోజు ప్ర‌సంగం చేశారు. మ‌హిళ‌లు ఏ రంగంలో రాణిస్తారో ఆ దిశ‌గా వారిని ప్రోత్సహించాలని ఆయ‌న చెప్పారు. మ‌హిళ‌ల అభిప్రాయాల‌ను గౌర‌వించాలని అన్నారు.
ప్ర‌స్తుతం వారు అన్ని రంగాల్లో మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్నార‌ని చెప్పారు. మ‌హిళ‌ల‌పై దారుణాల‌కు పాల్ప‌డే వారికి క‌ఠిన శిక్ష విధించాలని అన్నారు. న్యాయ‌స్థానాల్లో విచార‌ణ మ‌రింత వేగ‌వంతంగా జ‌ర‌గాలని అభిప్రాయ‌ప‌డ్డారు. భారత్ లో మహిళలకు ప్రాధాన్యమిస్తూ రక్షాబంధన్ లాంటి పండుగలు ఉన్నాయని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News