: ఇద్దరు పాకిస్థాన్ క్రికెటర్లపై సస్పెన్షన్ వేటు!
పాకిస్థాన్ క్రికెటర్లు షర్జిల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ లపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిద్దరిపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, వీరిద్దరినీ పాక్ క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో వీరిద్దరూ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో, వీరిద్దరిపై పీసీబీ విచారణ చేపట్టింది. వీరిద్దరూ ఫిక్సింగ్ కి పాల్పడ్డారన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ, సస్పెండ్ చేసింది. అయితే, ఫిక్సింగ్ కు పాల్పడ్డట్టు ఎలాంటి ఆధారాలను పీసీబీ బయటపెట్టలేదు.