: రోజాను గుంటూరు జిల్లా పేరేచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు?


వైసీపీ ఎమ్మెల్యే రోజాను గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద అడ్డుకున్న పోలీసులు... గుంటూరు జిల్లా పేరేచర్ల పోలీస్ స్టేషన్ కు ఆమెను తరలించినట్టు సమాచారం. ఎయిర్ పోర్ట్ వద్ద దాదాపు గంట సేపు రోజాను అడ్డుకున్న పోలీసులు... పోలీసు వాహనంలో విమానాశ్రయం నుంచి ఆమెను తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, ఆమెను ఒంగోలు మార్గంలో తరలిస్తున్నారన్న సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మరోవైపు, రోజాను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రోజాను వెంటనే విడుదల చేయకపోతే, ఏపీ డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. 

  • Loading...

More Telugu News