: ఒంగోలు మార్గంలో రోజాను తరలిస్తున్న పోలీసులు?


విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టులో వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దాదాపు గంటసేపు ఆమెను విమానాశ్రయంలోనే ఆపేశారు. అమరావతిలో మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు వద్దకు వెళ్లేందుకు వచ్చిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదస్సులో ప్రసంగించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని రోజా కోరినప్పటికీ, ఆమెకు అవకాశం ఇవ్వలేదు.

 ఈ నేపథ్యంలో, సదస్సు వద్ద నిరసన తెలిపేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్న కారణంతో... వారు అక్కడకు వెళ్లకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే, ముందు జాగ్రత్త చర్యగా రోజాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల వైఖరిని తప్పుబడుతున్నాయి. అయితే, విమానాశ్రయానికి దలైలామా వస్తున్నందునే రోజాను ఆపామని పోలీసులు చెబుతున్నారు. పోలీసు వాహనంలోనే ఆమెను ఎయిర్ పోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆమెను ఒంగోలు మార్గంలో తరలిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News