: పోలీసులను అడ్డుకున్న శశికళ ప్రైవేట్ సైన్యం.. తీవ్ర ఉద్రిక్తత.. లోపలకు చొచ్చుకుపోయిన పోలీసులు


హైకోర్టు ఆదేశాల మేరకు గోల్డెన్ బే రిసార్ట్స్ కు పోలీసులు చేరుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు అక్కడున్న ఎమ్మెల్యేల గురించి పోలీసులు ఒక అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, రిసార్ట్స్ వద్దకు ఈ ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. వీరితో పాటు ఆర్డీవో కూడా అక్కడకు వెళ్లారు. అయితే, పోలీసులు రిసార్ట్స్ లోకి వెళ్లకుండా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రైవేట్ సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో, అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

అయినప్పటికీ పోలీసులు శశి సైన్యాన్ని పక్కకు తోసేసి లోపలకు వెళ్లారు. ప్రస్తుతం రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేల వాంగ్మూలాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో రెండు గంటల సేపు పోలీసులు అక్కడే ఉండే అవకాశం ఉంది. అనంతరం ఈ వీడియో వాంగ్మూలాలను ఒక నివేదికగా తయారు చేసి... వీలైతే ఈరోజు లేకపోతే సోమవారంనాడు పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు.

  • Loading...

More Telugu News