: శశికళ ఈ పేరు పెట్టుకుంటే సీఎం కావడం ఖాయం.. ఫేస్ రీడర్ ఎం.రమణారావు జోస్యం


అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పేరు మార్చుకుని ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి అయి ఉండేవారని ఏపీకి చెందిన ప్రముఖ హస్త సాముద్రికుడు, ఫేస్ రీడర్ ఎం.రమణారావు పేర్కొన్నారు. శశికళను కలిసేందుకు శుక్రవారం చెన్నై చేరుకున్న ఆయన మాట్లాడుతూ శశికళ అనేది నెగెటివ్ పేరు అని, అలాకాకుండా ‘జయలలిత సెకండ్’ అని పేరు పెట్టుకుంటే ముమ్మాటికీ ముఖ్యమంత్రి కాగలిగేవారని పేర్కొన్నారు. అంతేకాదు ఆ పేరు పెట్టుకోవడం ద్వారా ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి కూడా గట్టెక్కుతారని పేర్కొన్నారు.

ఆ పేరుకు తిరుగే లేదని, కోర్టు తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చినా అరెస్ట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం ‘వేద నిలయం’ వాస్తు పరంగా కొన్ని నెగెటివ్ వైబ్రేషన్స్ పంపుతోందన్నారు. అది జయకు బాగున్నా, శశికళకు ప్రమాదకరమని వివరించారు. శశికళ పేరును బట్టి ఆమె ఆహారంలో ప్రత్యర్థులు విషం కలిపే అవకాశం ఉందన్నారు. ఇక పన్నీర్ సెల్వం ఇప్పుడు సీఎం కాగలిగినా రెండు మూడు నెలలకు మించి ఆయన ఆ పదవిలో కొనసాగలేరని రమణారావు జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News