: ప్రతీ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి నాయకుడు కావాలి.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ప్రశంసల వర్షం
చంద్రబాబు లాంటి కార్యదక్షత కలిగిన నాయకుడు ప్రతీ రాష్ట్రానికి కావాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అన్నారు. జాతీయ మహిళా పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. ‘లీడర్ షిప్’ అంటే ఇదేనంటూ మహిళా పార్లమెంట్ నిర్వహించిన తీరును కొనియాడారు. జాతీయ మహిళా పార్లమెంట్‌ను వార్షిక కార్యక్రమంగా మార్చాలని చంద్రబాబును కోరారు. అవకాశాలను ఎవరో ఇవ్వడం కాదని మనమే సృష్టించుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛత అంటే కేవలం ఓడీఫ్ కాదని, డ్రైన్లను మురికితో నింపేస్తూ తిరిగి వాటిని శుభ్రం చేయడానికి విదేశాల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నామని పేర్కొన్నారు. బాలికలను ధైర్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కిరణ్‌బేడీ అన్నారు.