: ముంబయిని కట్టడి చేసిన సన్ రైజర్స్
ఉప్పల్ లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు సత్తా చాటారు. పటిష్టమైన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ ను భారీ స్కోరు సాధించకుండా నిలువరించడంలో సఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 129 పరుగులు చేసింది. ముంబయి జట్టులో ఓపెనర్ డ్వేన్ స్మిత్ 38 పరుగులు చేయగా, తెలుగుతేజం అంబటి రాయుడు 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో అమిత్ మిశ్రా 2, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీశారు.