: ట్రంప్‌ను ఆడేసుకుంటున్న అమెరికన్లు.. రోగాలకు అధ్యక్షుడి పేర్లు పెడుతున్న వైనం!
వివాదాస్పద నిర్ణయాలతో పగ్గాలు చేపట్టిన కొన్ని రోజులకే ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ ప్రజలు వివిధ రకాలుగా తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. రోగాలకు, ఇతర చెడు కార్యక్రమాలకు ఆయన పేరు పెడుతూ కసి తీర్చుకుంటున్నారు. ఇటీవల ఎలీస్ స్టేపుల్టన్ అనే యువతి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు హాడ్జ్‌కిన్ లొఫోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. చికిత్సలో భాగంగా కణతిని తగ్గించేందుకు ఎలీస్‌కు వైద్యులు కీమో థెరపీ చేశారు. దీంతో యువతి జుట్టు మొత్తం రాలిపోయింది. అయినా ఎలీస్ ఏమాత్రం బాధపడడం లేదు. పైగా నవ్వులు చిందిస్తోంది. తనను అంతగా ఇబ్బందులకు గురిచేసిన ఆ కణతికి డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టింది. ట్రంప్ లాగే అది కూడా చాలా అసహ్యమైనదని, పనికిమాలినదని పేర్కొంది. ఇది మనిషిని యాతన పెడుతుందని చెబుతూ పరోక్షంగా ట్రంప్‌ను దుమ్మెత్తి పోసింది.