: ఆ రోజున మాతృ-పితృ పూజ దినోత్సవం జరుపుకోవాలని ఆదేశించిన కలెక్టర్!
పాశ్చాత్య సంస్కృతి ప్రకారం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే లేదా ప్రేమికుల రోజు దినోత్సవాన్ని యువత జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆ రోజున యువత అంతా తమ తల్లిదండ్రులను పూజించాలని, వారితో గడపాలని మధ్యప్రదేశ్ కు చెందిన కలెక్టర్ జేకే జైన్ ఆదేశించారు. ఛిన్ ద్వారా జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆయన ఈ మేరకు అక్కడి విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6న జారీ చేసిన ఆ ఆదేశాల ప్రకారం, ఫిబ్రవరి 14న ‘మాతృ-పితృ పూజ దినోత్సవం’గా జరుపుకోవాలని, తల్లిదండ్రులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైన ఉందని, ఆ బాధ్యత యువతపై మరింతగా ఉందని పేర్కొన్నారు. ఈ ఆదేశాల ప్రకారం, అన్ని ప్రాంతాల్లో ‘మాతృ-పితృ పూజ దినోత్సవం’ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.