: ఆ దుకాణానికి వెళితే ‘మోదీ జిలేబి’ ఉచితం!


ప్రధాని నరేంద్ర మోదీపై, భారతీయ జనతా పార్టీపై తనకు ఉన్న అభిమానాన్ని ఓ స్వీట్ షాప్ వాలా వినూత్న రూపంలో ప్రదర్శించాడు.  ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో  స్వీట్ షాపు నిర్వహిస్తున్న సురేశ్ సాహు ఎన్నో ఏళ్లుగా బీజేపీ అభిమాని. యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సాహు తనదైన శైలిలో పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఎలా అంటే, బీజేపీ గుర్తు అయిన ‘కమలం’ షేప్ లో జిలేబి తయారు చేస్తున్నాడు. ఈ జిలేబికి ‘మోదీ జిలేబి’ అని పేరుపెట్టాడు. అయితే, నోరూరించే  ఈ జిలేబిని తన దుకాణానికి వచ్చే వినియోగదారులకు ఆయన అమ్మట్లేదు .. ఉచితంగా పంచిపెడుతుండటం విశేషం. 

  • Loading...

More Telugu News