: ఇకపై ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సైతం దేశవ్యాప్తంగా ఒక్కటే పరీక్ష
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశపరీక్ష (నీట్)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఒకే పరీక్ష నిర్వహించాలని జాతీయ సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చేసిన ప్రతిపాదనలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ రోజు ఆమోద ముద్ర వేసింది. ఇప్పటివరకు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్రాలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.