: ‘ఓం నమో వేంకటేశాయ’ చూస్తుంటే సెకండ్ ఆఫ్ లో కన్నీళ్లు ఆగలేదు: చిరంజీవి


‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం చూస్తుంటే సెకండ్ ఆఫ్ లో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినీ ప్రముఖుల కోసం చిత్ర బృందం ప్రీమియర్ షో ఏర్పాటు చేసింది. ఈ షోకు చిరంజీవి, నిర్మాత దిల్ రాజు, సుశాంత్, వంశీ పైడిపల్లి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు హాజరయ్యారు. అనంతరం, చిరంజీవి మాట్లాడుతూ, నాగార్జున కెరీర్ లో ఈ చిత్రం ఓ కలికితురాయి అని, ఇటువంటి సినిమా చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ, ఈ చిత్రంలో చివరి అరగంట సేపు కన్నీళ్లు ఆగలేదని, ‘అన్నమయ్య’ తర్వాత అంత గొప్ప సినిమా ఇది అని అన్నారు. 

  • Loading...

More Telugu News