: త్వరలోనే శుభవార్త వింటారు: మరోసారి మీడియా ముందుకు వచ్చిన పన్నీర్ సెల్వం


అన్నాడీఎంకే పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్‌పై తిరుగుబాటు చేస్తున్న ప‌న్నీర్ సెల్వం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ప్రజలు మెచ్చిన వ్యక్తే సీఎంగా ఉండాల‌ని ఆయన అన్నారు. అన్నాడీఎంకేను ఎవ్వ‌రూ చీల్చ‌లేర‌ని వ్యాఖ్యానించారు. ఎంజీఆర్, జ‌య‌ల‌లిత బాట‌లో న‌డిచి పార్టీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. త‌మ‌కు మంచిరోజులు వ‌స్తాయ‌ని అన్నారు. త్వ‌ర‌లోనే శుభ‌వార్త వింటార‌ని అన్నారు. ఓ పెద్ద మ‌ర్రిచెట్టులా ఎదిగిన త‌మ‌ పార్టీని ఎవ్వ‌రూ పెకిలించ‌లేర‌ని స్ప‌ష్టం చేశారు. అటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే తాము చూస్తూ ఊరుకోబోమ‌ని అన్నారు.    

  • Loading...

More Telugu News