: డొనాల్డ్ ట్రంప్ కి ఫోన్ చేసి మాట్లాడిన ఇరాక్ ప్రధాని
సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ ఫోన్ చేసి, తమ దేశంపై విధించిన ట్రావెలింగ్ బ్యాన్ తొలగించాలని కోరారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమాయకులైన తమ ప్రజలు కష్టాలు పడుతున్నారని తెలిపారు. తమ దేశానికి అమెరికా నుంచి ఆర్థికంగా, రాజకీయంగా, సైనిక రక్షణపరంగా ప్రపంచంలోనే అత్యధిక సహాయం అందుతోందని ట్రంప్‌కి ఆయన గుర్తు చేశారు.