: మరో ఆసక్తికర పరిణామం.. తమిళనాడు గవర్నర్ తో స్టాలిన్ భేటీ
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గవర్నర్ నుంచి ఇంకా ప్రకటన రాకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. నిన్న సాయంత్రం ఆ రాష్ట్ర ఇన్ ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్ వేర్వేరుగా భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ రాజ్‌భవన్‌కు వచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో వచ్చి గవర్నర్‌ను కలిసిన ఆయన.. రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చిస్తున్నారు. గవర్నర్‌తో స్టాలిన్ భేటీ అవడం మరోసారి ఆసక్తిగా మారింది.