: శశికళను పార్టీ నుంచి మేమే బహిష్కరిస్తాం: చిన్నమ్మకు షాకిచ్చే ప్రకటన చేసిన మధుసూదనన్
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం పావులు కదుపుతున్న శశికళ నటరాజన్‌కు పన్నీర్ సెల్వం వర్గం ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా ఆ పార్టీ నేత మధుసూదనన్ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీని త్వరలోనే ఎన్నుకుంటామని చెప్పారు. శశికళను పార్టీ నుంచి తామే బహిష్కరిస్తామని తెలిపారు. అమ్మ వేద నిలయం నుంచి రెండు రోజుల్లో శశికళను పంపిచేస్తామని తెలిపారు. వేద నిలయం ప్రజల ఆస్తి అని ఆయన అన్నారు. తమ జనరల్ సెక్రటరీ ఎవరో పార్టీ కేడరే తేలుస్తుందని చెప్పారు.