: వదంతుల ప్రభావంతో రూ.10 నాణేలను పట్టుకొని బ్యాంకులకు పరుగులు పెట్టిన ప్రజలు!


కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయ‌డంతో దేశ వ్యాప్తంగా చిల్లర కొరత ఏర్ప‌డి రూ.10 నాణేలను విరివిగా ఉప‌యోగించిన సంగతి తెలిసిందే. అయితే, ప్ర‌స్తుతం ఆ నాణేల‌పై వ్యాపిస్తోన్న వ‌దంతులు ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురిచేస్తున్నాయి. ఆ నాణేలు చెల్ల‌డం లేదంటూ వ‌చ్చిన‌ వ‌దంతుల‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు గంద‌ర‌గోళానికి గుర‌వుతూనే ఉన్నారు. ప్ర‌స్తుతం కర్ణాటక అంతటా ఈ వ‌దంతులు విప‌రీతంగా వ్యాపిస్తున్నాయి. అవి ఇక చెల్లవని ఆర్‌బీఐ ఉత్తర్వులు ఇచ్చిందంటూ అంద‌రూ చెప్పుకుంటున్నారు. ఈ ప్ర‌భావంతో సామాన్యులు, చిరు వ్యాపారులు త‌మ వ‌ద్ద ఉన్న రూ.10 నాణేల‌ను ప‌ట్టుకుని బ్యాంకులకు పరుగులు తీశారు. ఆ నాణేలు చెల్లుబాటులోనే ఉన్నాయ‌ని బ్యాంకు అధికారులు స‌మాధానం ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News