: మళ్లీ పాక్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనబోతున్న ముషార్రఫ్


పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్ తాజాగా మాట్లాడుతూ తాను మళ్లీ తమ దేశ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనబోతున్నట్లు సంకేతాలిచ్చారు. తనతో తమ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులంతా ఎప్ప‌టికప్పుడు టచ్‌లో ఉంటున్నారని తెలిపారు. త్వరలోనే దేశంలోకి మూడో రాజకీయ కూటమి వస్తుందని, ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చుతుంద‌ని వ్యాఖ్యానించారు. తాము ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌, సామాజిక మాధ్య‌మాల‌ను విస్తృతంగా ఉప‌యోగించుకోనున్న‌ట్లు పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే తాము తీసుకురానున్న సంస్కరణల అజెండాలను చెబుతామ‌ని అన్నారు. ప్ర‌స్తుతం పాకిస్థాన్‌ సంక్షోభంలో ఉందని చెప్పిన ముషార్ర‌ఫ్ తాము పాక్‌ను అందులోంచి బయటపడేస్తామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News