: పవర్ స్టార్ కలిసిన ప్రముఖుడు స్టీవ్ జార్డింగ్ రాజకీయ వ్యూహాల్లో దిట్ట!
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈరోజు ఓ ప్రముఖ వ్యక్తి స్టీవ్ జార్డింగ్ ను కలుకున్నారు. హార్వర్డ్ విశ్వ విద్యాలయంలోని కెనెడీ స్కూల్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ప్రజా విధానాలు, రాజకీయ వ్యూహాల రూపకల్పన వంటి అంశాలపై ఆయనకు విశేషమైన అనుభవం ఉంది.
ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన రాజకీయ నేతల కాకుండా, ఇతర దేశాలకు చెందిన వారూ ఆయన్ని కలిసి తగు సూచనలు, సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఈక్రమంలోనే జార్డింగ్ ను పవన్ కలిసినట్లు సమాచారం. ఏపీలో 2019లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి వీరు చర్చించారని, రాజకీయ ఎత్తుగడలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలూ ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీ జరిగింది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మరోమారు కలుస్తానని జార్డింగ్ తో పవన్ అన్నట్లు సమాచారం. కాగా, యూపీలో తమ పార్టీ అభివృద్ధి నిమిత్తం ములాయంసింగ్ కూడా చాలాసార్లు జార్డింగ్ ను కలిశారట. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జార్డింగ్ వ్యూహాలనే అఖిలేష్ అమలు చేస్తున్నారని సమాచారం.