: విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అత్యవసర ద్వారాన్ని తెరిచిన ప్రయాణికుడు


విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఓ ప్ర‌యాణికుడు ఎమర్జెన్సీ విండోను ఓపెన్‌ చేయటంతో ఒకరికి తీవ్ర గాయాలయిన ఘ‌ట‌న ఈ రోజు ముంబయి నుంచి చండీగఢ్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. టేకాఫ్ అవుతున్న స‌మ‌యంలో 12సీ సీటులో కూర్చున్న ప్ర‌యాణికుడు ఒక్క‌సారిగా లేచాడ‌ని, అనంత‌రం ఈ ప‌నిచేశాడ‌ని సంబంధిత‌ అధికారులు పేర్కొన్నారు. దీంతో అదే సీటులో కూర్చున్న మ‌రో ప్ర‌యాణికుడికి గాయాల‌య్యాయ‌ని, బాధితుడికి చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. అత్య‌వ‌స‌ర ద్వారం తెర‌చి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన ప్ర‌యాణికుడిని విమాన‌ సిబ్బంది వెంటనే అడ్డుకున్నారని, అనంత‌రం కెప్టెన్‌కి సమాచారం అందించార‌ని చెప్పారు. దీంతో అత‌డు ఆ స‌మాచారాన్ని గ్రౌండ్‌ స్టాఫ్‌కి తెలిపి, విమానం ఇంజిన్‌ని ఆపేశాడని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో స‌ద‌రు ప్ర‌యాణికుడిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News