: మన్మోహన్ కు క్లీన్ చిట్ ఇచ్చిన రాజ్ నాథ్ సింగ్


మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ క్లీన్ చిట్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినా... మన్మోహన్ మాత్రం మిస్టర్ క్లీన్ గా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా మన్మోహన్ పై బీజేపీకి ఎంతో గౌరవం ఉందని చెప్పారు. రెండు రోజుల క్రితం రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, బాత్ రూమ్ లో రెయిన్ కోటు వేసుకుని స్నానం చేసే కళ డాక్టర్ సాహెబ్ కు మాత్రమే తెలుసంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఎవరినీ కించపరిచే విధంగా మాట్లాడలేదని రాజ్ నాథ్ అన్నారు. 

  • Loading...

More Telugu News