: శశికళ సమర్పించిన పత్రంలో పన్నీర్ పేరు, సంతకం!
అన్నాడీఎంకే నేత శశికళ తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావుకు నిన్న సమర్పించిన విషయం తెలిసిందే. ఆ పత్రంలో తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పేరు, సంతకం కూడా ఉన్నాయట. ఈ నేపథ్యంలో శశికళ సమర్పించిన పత్రంలోని ఎమ్మెల్యేల సంతకాలు నిజమైనవా? లేక ‘ఫోర్జరీ’ చేశారా? అనే విషయమై రాజ్ భవన్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.