: భారీగా దిగజారిన బంగారం ధర
కొన్ని రోజుల నుంచి దిగుతూ, పెరుగుతూ వస్తోన్న బంగారం ధర ఈ రోజు భారీగా పడిపోయింది. మూడు వారాల కనిష్ఠానికి దిగజారి దేశ రాజధానిలో ఢిల్లీలో రూ.400 తగ్గింది. అక్కడ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 29,500గా నమోదైంది. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి మద్దతు లభించకపోవడంతో వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తూ కిలోకి రూ.490 తగ్గింది. ప్రస్తుతం వెండి ధర రూ.42,250గా ఉంది.
ఇక గ్లోబల్ మార్కెట్లో 0.42శాతం తగ్గిన పసిడి ధర ఔన్సు 1,222.70 అమెరికన్ డాలర్లుగా ఉంది. కాగా, వెండి ధర 0.28శాతం తగ్గి 17.50 డాలర్లుగా ఉంది.