: గవర్నర్ మమ్మల్నే పిలుస్తారు... ఆశల పల్లకిలో శశికళ వర్గీయులు!


తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విద్యాసాగర్ రావు తమనే ఆహ్వానిస్తారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే ఆశల పల్లకిలో వారు విహరిస్తున్నారు. ఏ క్షణంలోనైనా గవర్నర్ నుంచి తమకు పిలుపు రావచ్చని... అందుకే అందరం ఒకే చోట ఉన్నామని శశి మద్దతుదారు రత్నస్వామి తెలిపారు. అందరూ అనుకుంటున్నట్టు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా రిసార్ట్స్ లో లేరని... ఎవరి స్థానాల్లో వారు ఉన్నారని శశి వర్గీయులు అంటున్నారు. పన్నీర్ సెల్వం శిబిరంలోని వారు మాత్రం ఎమ్మెల్యేలను బంధించారని ఆరోపిస్తున్నారు. 

  • Loading...

More Telugu News