: అత్యుత్సాహం.. దురుసు ప్రవర్తన.. ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్ట్స్ లోపలికి రానివ్వని బౌన్సర్లు
అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ గోల్డెన్ బే రిసార్ట్స్‌లో తమ ఎమ్మెల్యేలను ఉంచిన విషయం తెలిసిందే. అయితే, ఆ రిసార్ట్స్ వద్ద ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎవరినీ లోపలికి అనుమతించబోమని తెగేసి చెప్పారు. మీడియాకు వారిని ప్రశ్నించే హక్కు ఉందని చెప్పిన విలేకరులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో బౌన్సర్లు, మీడియా ప్రతినిధులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. బౌన్సర్ల తీరు పట్ల విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కొద్ది సేపటి క్రితం రిసార్ట్స్ బయటకు వచ్చి 11 మంది ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే.