: స్టాలిన్ చెంత చేరిన 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు?
తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి మారుతూ, నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు శశికళ, పన్నీర్ సెల్వంల వర్గ పోరు వేడిని పుట్టించగా... తాజాగా డీఎంకే నేత స్టాలిన్ సీన్ లోకి ఎంటరయ్యారు. శశికళ వర్గానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు స్టాలిన్ తో టచ్ లో ఉన్నారన్న వార్త... ఇప్పుడు సంచలనంగా మారింది. వాస్తవానికి మరో 20 మంది ఎమ్మెల్యేలను లాగేస్తే... స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, తెరవెనుక స్టాలిన్ వేసే ఎత్తులను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. పన్నీర్ సెల్వం, శశికళ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో తాము విసిగిపోయామని... అందుకే తాము డీఎంకే వైపు మొగ్గు చూపుతున్నామని 15 మంది ఎమ్మెల్యేలు చెబుతున్నట్టు సమాచారం.