: పన్నీర్ వర్గీయులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.. రెండు రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నాం: సరస్వతి
తమ ఎమ్మెల్యేల ఫోన్లను ఎవరూ తీసుకోలేదని... పన్నీర్ సెల్వం వర్గీయుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నందునే ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నామని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు. గత రెండు రోజులుగా తనకు కూడా పలువురు ఫోన్ చేసి బెదించారని చెప్పారు. తన ఫోన్ నంబరును అనేక మందికి పంపించారని... వారంతా తనకు ఫోన్ చేసి, మనశ్శాంతి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం తనకు ఉందని... శశికళ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు.
ఇదే సమయంలో శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యే రామ జయలింగం మాట్లాడుతూ, గవర్నర్ నిర్ణయం వెలువడిన వెంటనే తామంతా బయటకు వస్తామని చెప్పారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపారు. క్యాంపులో ఎవరూ నిరాహార దీక్ష చేయడం లేదని అన్నారు.