: కాసేపట్లో తమిళనాడు గవర్నర్ ప్రకటన.. పెరిగిన ఉత్కంఠ


త‌మిళ‌నాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఉత్కంఠ కొన‌సాగుతోంది. నిన్న రాజ్‌భ‌వ‌న్‌లో త‌మిళ‌నాడు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం, అన్నాడీఎంకే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శ‌శిక‌ళ‌తో వేర్వేరుగా భేటీ అయిన ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగర్ రావు వారితో కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ మ‌రికాసేప‌ట్లో మీడియా ముందుకు రానున్న‌ట్లు రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలను బట్టి తెలుస్తోంది. మ‌రోవైపు రాజ్‌భ‌వ‌న్‌కు మ‌ద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి చేరుకొని విద్యాసాగ‌ర్ రావుని క‌లిశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌ట‌న‌లో ఏముంటుందోన‌ని ఉత్కంఠ మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయ‌న ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News