: తన అనుచరులతో కలసి మరోసారి మీడియా ముందుకు వచ్చిన పన్నీర్ సెల్వం


తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన అనుచరులతో కలసి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ, పార్టీలోని ఎమ్మెల్యేలంతా తనవైపే ఉన్నారని... శశికళ వైపు ఎవరూ లేరని తెలిపారు. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించడం బాధాకరమని అన్నారు. ప్రస్తుతం తన వద్దకు ఆరుగురు ఎమ్మెల్యేలు వచ్చారని చెప్పారు.

పార్టీ సీనియర్ నేత పొన్నుస్వామి మాట్లాడుతూ, జయలలిత వారసత్వాన్ని కొనసాగించే అర్హత కేవలం పన్నీర్ సెల్వంకే ఉందని తేల్చి చెప్పారు. అమ్మ బతికి ఉన్నప్పుడే ముఖ్యమంత్రి బాధ్యతలను పన్నీర్ కు అప్పగించారని... ఇప్పుడు కూడా ఆ స్థానం ఆయనదే అని ఆయన తెలిపారు. డబ్బుకోసం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, నాయకులు శశికళ వెంట పడరాదని సూచించారు. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలంతా శశికళ ఉచ్చులో పడకుండా, ఆత్మప్రబోధానుసారం నడుచుకోవాలని కోరారు. అమ్మ ఆశయ సాధన కోసం అందరం కలసి పనిచేయాలని విన్నవించారు. 

  • Loading...

More Telugu News