: ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ - ఎస్పీ కూటమికి జోష్... ప్రచారపర్వంలోకి ప్రియాంకా గాంధీ
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయంపై కన్నేసిన ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి ప్రచారం కోసం గాంధీ కుటుంబం తరఫున ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగబోతున్నారు. ఇందిరాగాంధీ పోలికలతో ఉండే ప్రియాంకా గాంధీ ఇన్నాళ్లూ తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీలు పోటీ చేసే రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితమయ్యారు. తొలిసారిగా ఆమె పూర్తి స్థాయిలో రాజకీయ ప్రచారం నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. యూపీలో అరడజను నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. దీని ప్రకారం చూస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంకా పెద్ద పాత్ర పోషించనున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.